ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గ్లోబ్‌ట్రాటర్’(GlobeTrotter) 15.11.2025 రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా లాంచ్ చేసారు. ఈ సినిమా తోలి ఈవెంట్ కి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. భారీ సెటప్, లైవ్ ప్రొజెక్షన్లు, సెలబ్రిటీలు హాజరు కావడంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్ లో పలు మీడియా సంస్థలు ఈ చిత్రానికి అధికారిక టైటిల్‌గా “వారణాసి” ఖరారైందని వెల్లడించాయి.
ఈవెంట్ విజువల్స్‌లో మహేశ్ బాబు అడ్వెంచర్ అవతారంలో కనిపించాడు. ఆయన ఎద్దుపై స్వారి చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రధాన మీడియా సంస్థలు ‘వారణాసి’నే రాజమౌళి తదుపరి భారీ ప్రాజెక్ట్‌గా పేర్కొన్నాయి.
రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్‌పై ఈ సినిమా టీజర్‌ను ప్రదర్శించారు. మరియు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ప్రత్యేక లైవ్ కవరేజ్ కూడా ఏర్పాటు చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఈ వేడుకలో శృతి హాసన్ చాలా హైలైట్‌గా నిలిచింది. అంతేకాక, మనజ్మేంట్మహేష్ బాబు అభిమానుల కోసం కోసం ప్రత్యేక “ఈవెంట్ పాస్పోర్ట్స్” కూడా అందించారు.
మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, ప్రిత్వీరాజ్ సుకుమారన్ లు ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరి బీటీఎస్ (BTS) అప్డేట్స్, వేదిక పైకి వస్తున్న విజువల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమానికి సుమా కనకాల యాంకరింగ్‌ని చేయగా, ఇన్ఫ్లుయెన్సర్ ఆశిష్ చంచ్లానీ కూడా ఈవెంట్లో పాల్గొన్నాడు.
మొదటి టీజర్ ఈ కార్యక్రమం ప్రధాన కీలక బిందువుగా నిలిచింది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో టీజర్ ముందే లీక్ అయ్యిందన్న చర్చ నడిచింది. అయితే అధికారిక ప్రసారంతో అభిమానుల్లో జోష్ రెట్టింపైంది.
సినిమా రిలీజ్ తేదీపై మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ ఈ సినిమా 2027 లో రిలీజ్ అవుతుందని అని ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం. కీరవాణి గారు చెప్పారు.
ఈ ఈవెంట్ తో మాత్రం మహేష్ బాబు ఫాన్స్ కి మంచి బూస్ట్ వచ్చింది అని చెప్పవచ్చు .