అమెరికా నేలపై మరో తెలుగు ఇంటి కల సమాది అయింది. బాపట్ల జిల్లా కారంచెడు గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి యర్లగడ్డ అనే 23 ఏళ్ల యువతి నవంబర్ 7న అమెరికా టెక్సాస్లోని తన గదిలో అనారోగ్మృయంతో మృతిచెందింది. గుండె పగిలే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అంతటా దుఃఖాన్ని ముంచెత్తింది. విదేశాలకు వెళ్లి చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, తల్లిదండ్రులను ఆర్థికంగా నిలబెట్టాలనే కలలతో ఆమె జీవితం సాగుతుండగా ఆ కల అర్ధాంతరంగా సమదైంది.
ఆమె చివరి రాత్రి – తెలియని నిశ్శబ్దం
రాజీ గత కొద్ది రోజులుగా దగ్గు, ఛాతినొప్పితో బాధపడుతోందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వైద్యుడిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. నవంబర్ 6 రాత్రి స్నేహితులతో విందు చేసి తన గదికి వెళ్లి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం అలారం మోగినా లేవకపోవడంతో రూమ్మేట్స్ వెళ్లి చూసేసరికి ఆమె అప్పటికే చనిపోయి ఉందని, వెంటనే ఆమె స్నేహితులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లిన అక్కడి వైద్యులు ఆమె మరణాన్ని ధృవీకరించారు.
డాక్టర్లు ప్రాథమికంగా ఇది సహజ మరణంగా భావిస్తున్నప్పటికీ, అసలు కారణం కోసం మృతదేహంపై పోస్ట్ మోర్ట్o జరుగుతోంది. ఆమె తీవ్రమైన దగ్గు, ఛాతినొప్పిని పరిగణనలోకి తీసుకొని గుండె లేదా శ్వాసకోశ సమస్య కారణమై ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజీ తల్లిదండ్రుల కలలు చెల్లాచెదురయ్యాయి
రాజీ తండ్రి రామకృష్ణ, తల్లి నాగమణి వ్యవసాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమ కూతురి ఉన్నత చదువుల కోసం అప్పులు చేసారు. తమ కూతురు ఉద్యోగం సంపాదించి ఆ అప్పులు తీర్చి, తల్లిదండ్రులను సుఖంగా ఉంచాలని కలలు కనింది. కానీ ఆ కలలు అమెరికా నేలమీదే ఆగిపోయాయి.
ఆమె బంధువు చైతన్య యీవీకే అమెరికాలో గో ఫండ్ మీ (GO fund me) ద్వారా నిధులు సేకరిస్తున్నారు. రాజి అంత్యక్రియలకు , మృతదేహన్ని ఇండియా తీసుకురావడం కోసం, ఆమె తల్కోలిదండ్సంరులు చేసిన అప్పులు తీర్చడం కోసం, ఈ నిధులు వినియోగించనున్నారని తెలిపారు.
“రాజీ ఇంత చిన్న వయసులో ఎన్నో కలలు కన్నాది. తన తల్లిదండ్రుల కష్టానికి చిరునవ్వు ఇవ్వాలనుకుంది. కానీ విధి ఆమెను మధ్యలోనే తీసుకుపోయింది,” అని చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు.
విధి పిలుపుతో ముగిసిన వెలుగులు
రాజ్యలక్ష్మి మృతి వార్త తెలిసిన వెంటనే అమెరికాలోని తెలుగు విద్యార్థి సంఘాలు, భారత కాన్సులేట్ అధికారులు, అక్కడి తెలుగు సమాజం అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. అంత్యక్రియల ఏర్పాట్లలో సహాయం చేస్తామని భారత కాన్సులేట్ హామీ ఇచ్చింది. తెలుగు సంఘాలు కూడా నిధులు సేకరించి, ఆమె మృతదేహాన్ని భారత్ కి పంపుకునేందుకు సహకరిస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేక మంది విద్యార్థులు, స్నేహితులు, తెలుగు ప్రజలు ఆమె జ్ఞాపకాలను పంచుకొని, నివాళులు అర్పిస్తున్నారు. ఆమె కలలు నెరవేర్చలేకపోయినందుకు అందరూ బాధ వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యలక్ష్మి – పేరు మిగిలింది, కలలు మిగిలాయి… కానీ ఆమె హృదయ పూర్వక కృషి, తల్లిదండ్రుల కోసం చేసిన త్యాగం మాత్రం ఎన్నటికీ మరువలేము.