దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ 1వ గేట్ నంబర్ సమీపంలో భారీ పీడు సంభవించింది వివరాల ప్రకారం ఈ రోజు సాయంత్రం పార్క్ చేసిన ఒక కారు ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది. ఈ పేలుడు ప్రభావంతో సమీపంలోని అనేక వాహనాల్లో మంటలు అంటుకోవడంతో చుట్టు ప్రక్కల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆదినంలోకి తీసుకొని సీర్చింగ్ చేస్తున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అధికారులు పేలుడు కారణాన్ని కనుగొనేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పేలుడుకు కారణం పార్క్ చేసిన కారు లోపల లేదా దాని సమీపంలో ఏదైనా పీలుడు వస్తువులు పెట్టవచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మంటలు వేగంగా వ్యాపించటంతో పక్కనే ఉన్న వాహనాలను దగ్ధం కావడం మరియు 24 మంది గాయపడినట్లు, 12 మంది వరకు మరణించినట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నప్పటికీ, అధికారిక నిర్ధారణకు ఇంకా రాలేదు.
కొన్ని వర్గాలు ఇది సిఎన్జీ సిలిండర్ పేలుడు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. అయితే అధికారులు ఇప్పటివరకు ఏ కారణాన్నీ అధికారికంగా ప్రకటించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఫోరెన్సిక్ మరియు బాంబ్ స్క్వాడ్ బృందాలు సాక్ష్యాలు సేకరిస్తున్నాయి. ఎన్ఎస్జీ కమాండోలు, ఎన్ఐఏ బృందం కూడా విచారణలో పాల్గొంటున్నాయి.
ఎర్రకోట మెట్రో గేట్ నంబర్ 1 ప్రాంతం చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లోకి వచ్చాయి. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకూడదని, పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు సూచించారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని తప్పుడు సమాచారాలను నమ్మవద్దని, అధికారిక పోలీసు లేదా ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రమే సమాచారం పొందాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే డిల్లీ మరియు సరిహద్దు ప్రాంతాలు అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన చారిత్రక ప్రదేశాలు, మెట్రో స్టేషన్ల వద్ద తనిఖీలు పెంచారు. ఈ సంఘటన పై ఇంకా అధికారిక కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు పేలుడు కారణంపై పూర్తి నివేదిక త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.