రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా కఫన్వాడా గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అజిత్ సింగ్ చౌధరి, డాక్టర్ కావాలనే కలతో 2023లో రష్యాకు MBBS చదవడానికి వెళ్లాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అజిత్ కలలకు ఆయన తల్లిదండ్రులు రూప్ సింగ్ మరియు సంత్రా దేవి తమ జీవితాన్ని కొడుకు కోసం పణంగా పెట్టారు. రైతు కుటుంబానికి చెందిన అజిత్ సింగ్ తల్లిదండ్రులు అతని వైద్య విద్య కోసం వాళ్ళకున్న మూడు బీఘాల భూమి అమ్మి రష్యా ఉఫా నగరంలోని బష్కీర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో MBBS చదువు కోవడానికి పంపారు. అజిత్ అప్పటికి తన ఎంబీబీఎస్ కోర్సులో మూడో సంవత్సరం చదువుతున్నాడు ఇది అతని కుటుంబానికి అరుదైన గర్వకారణం.
అయితే, అజిత్ జీవితం మరియు అతని కలలు ఒక రహస్య సంఘటనతో విషాదాంతమవుతాయని ఎవ్వరు ఊహించలేదు. కానీ అ రోజు 2025 అక్టోబర్ 19న ఉదయం 11:00 గంటల సమయంలో, అతను హాస్టల్ నుండి బయలుదేరి “పాలు తీసుకురావడానికి వెళ్తున్నాను, వెంటనే వస్తాను” అని అతని స్నేహితులకి చెప్పి వెళ్ళిన ఆటను మల్లి తిరిగి రాలేదు. యూనివర్సిటీ అధికారులు, రూమ్ మేట్స్,స్నేహితులు కలిసి స్తానిక పోలీసులకు సమాచారం ఇచ్చినారు. తర్వాత పోలీసులు భారత రాయభారి కార్యాలయానికి సమాచారం ఇచ్చారు, వెంటనే అధికారులు ఇండియాలో వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తక్షణమే అతని మామగారు మరియు కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మరియు అల్వార్ జిల్లా కలెక్టర్ సహా భారత ప్రభుత్వ అధికారులను సంప్రదించారు, సమాచారం కోసం విజ్ఞప్తి చేశారు.
అజిత్ అదృశ్యమైన మరుసటి రోజున రష్యన్ అధికారులు వైట్ రివర్ ఒడ్డున ఉన్న అతని దుస్తులు, మొబైల్ ఫోన్, చెప్పులు కనుగొన్నారు. దీనితో పోలీసులకు మరింత అనుమానాలకు దారితీసింది. వర్షాకాల ప్రభావంతో ఆ నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు వెతకడం మొదలుపెట్టారు. 19 రోజుల తర్వాత మాస్కోలోని భారత రాయబార కార్యాలయం మరియు యూనివర్సిటీ విద్యార్థులు గాలింపు చర్యల తర్వాత చివరకు 2025 నవంబర్ 6న వైట్ రివర్‌కు సమీపంలోని డ్యామ్‌లో అజిత్ మృతదేహం కనుగొన్నారు.
“మా కుమారుడి చదువుల కోసం భూమి అమ్మాం. డాక్టర్ అవుతాడని ఆశపడ్డాం. ఇప్పుడు మా ఆశలన్నీ చిద్రమయ్యాయి.” _ రూప్ సింగ్ మరియు సంత్రా దేవి.
ఈ విషాదం అజిత్ కుటుంబాన్ని కుదిపేసింది. తల్లిదండ్రులు రూప్ సింగ్, సంత్రా దేవి తమ కొడుకును చదివించడానికి చేసిన త్యాగాలు ఇలా రష్యాలో ముగిసిపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. యూనివర్సిటీ మరియు రష్యన్ పోలీసుల నిర్లక్ష్యం, ఆలస్య స్పందనపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, విద్యార్థి మిత్రులు, గ్రామ పెద్దలు ఈ సంఘటనపై పారదర్శకమైన, నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దుస్తులు, వస్తువులు కనిపించిన తీరు, కాలవ్యవధిలోని గ్యాప్ దృష్ట్యా అనేకమంది ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, ఏదో రహస్యమైన విషయం ఉందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.
ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాయడం జరిగింది. ఈ విషయం గూర్చి రష్యన్ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అలాగే అజిత్ మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భారత రాయబార కార్యాలయం రష్యన్ అధికారులతో సమన్వయం చేస్తోందని, రష్యన్ వైద్య బోర్డు ద్వారా పోస్ట్‌మార్టం జరుగుతుందని, ఈ ప్రక్రియ పూర్తయ్యాకే అజిత్ మృతదేహం కుటుంబానికి అప్పగించబడుతుందని తెలపడం జరిగింది. ప్రస్తుతం అజిత్ సింగ్ అధికారిక మరణ కారణం నిర్ధారణ కాలేదు. దర్యాప్తు ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. అజిత్ కుటుంబం మరియు సహ విద్యార్థులు నిజమైన కారణం వెలుగులోకి రావాలంటే పారదర్శకమైన దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రత, వారి రక్షణ కూడాతెలియపరుస్తుంది. ఒక కుటుంబం కోల్పోయిన కల ఇప్పుడు వేలాది విద్యార్థుల కోసం న్యాయం మరియు సంస్కరణల అవసరాన్ని గుర్తుచేస్తోంది.