vivo X200T లోని ఈ ‘స్పెషల్’ ఫీచర్ చూస్తే ఫిదా అవుతారు!

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో ‘X’ సిరీస్ ఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే వివో X200 మరియు X200 ప్రో మోడల్స్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు కంపెనీ తన లైనప్‌లోకి vivo X200T అనే సరికొత్త మోడల్‌ను తీసుకువస్తోంది. ఈ ‘T’ సిరీస్ అనేది వివో ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో మొదటిసారి రాబోతోంది, అందుకే టెక్ వర్గాల్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 27, 2026 మధ్యాహ్నం 12 గంటలకు (IST) ఈ ఫోన్ అధికారికంగా ఇండియాలో లాంచ్ కానుంది. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం, ముఖ్యంగా కెమెరా మరియు పెర్ఫార్మెన్స్‌లో రాజీ పడని వారి కోసం ఈ ఫోన్ ఒక హాట్ టాపిక్‌గా మారింది.

ఇది చదవండి: Nothing Phone 4a Pro వచ్చేస్తోంది! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్, ధర లీక్.. గట్టి పోటీ తప్పదా?

డిజైన్ మరియు డిస్‌ప్లే విషయంలో వివో ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. vivo X200T లో మనకు 6.67-inch AMOLED స్క్రీన్ లభిస్తుంది.

• ఇది 1.5K Resolution మరియు 120Hz Refresh Rate కి సపోర్ట్ చేస్తుంది.

• 460 PPI మరియు 5000 nits Peak Brightness వల్ల మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది.

• దీనిని ZEISS Master Color Display అని పిలుస్తారు, ఇది ప్రొఫెషనల్ లెవల్ 1.07 true to life నిజమైన కలర్ అక్యూరెసీని అందిస్తుంది.

• కళ్ళపై ఒత్తిడి పడకుండా ఇందులో అడ్వాన్స్‌డ్ “Eye Protection” ఫీచర్లు ఉన్నాయి.

• కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, స్టెల్లార్ బ్లాక్ (Stellar Black) మరియు సీసైడ్ లిలాక్ (Seaside Lilac) వంటి ప్రీమియం షేడ్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Performance విషయంలో మాత్రం ఈ ఫోన్ ఒక బీస్ట్ (Beast) అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో లేటెస్ట్ MediaTek Dimensity 9400+ చిప్‌సెట్ (3nm process) ఉపయోగించారు. దీని AnTuTu స్కోర్ 3 లక్షల కంటే ఎక్కువగా ఉండటం ఈ ఫోన్ ప్రతేకత. కేవలం నంబర్స్ మాత్రమే కాదు, ఇందులో ఉన్న “all-big-core design” వల్ల పెద్ద గేమ్స్ ఆడినా లేదా హెవీ మల్టీటాస్కింగ్ చేసినా ఫోన్ వేడెక్కకుండా, చాలా కూల్‌గా మరియు స్టేబుల్‌గా పనిచేస్తుంది.

సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై నడుస్తుంది. ఇది చాలా ఫీచర్-రిచ్ స్కిన్. ముఖ్యంగా ఇందులో ఉన్న “Origin Island” ఫీచర్ ద్వారా మనకు అవసరమైన టెక్స్ట్ లేదా ఇమేజెస్‌ని సెకన్లలో ఎక్స్‌ట్రాక్ట్ చేసి వేరే యాప్స్‌లోకి షేర్ చేయవచ్చు (Extract and Act). ఇక స్టూడెంట్స్ మరియు ఆఫీస్ కి వెళ్ళే వారికోసం “vivo Office Kit” ఉంది. దీని ద్వారా మీ విండోస్ పిసి లేదా మ్యాక్ (Remote PC) ను ఫోన్ నుండే ఆపరేట్ చేయవచ్చు మరియు ఫైల్స్ ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ కేవలం చూడటానికి మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్‌లో కూడా రాజీ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో వస్తోంది. దీని మెమరీ ప్రత్యేకతలు ఇవే:

• RAM: 12GB LPDDR5x (సూపర్ ఫాస్ట్ మల్టీటాస్కింగ్) ఇది పాత మోడల్స్ కంటే 30% వేగంగా పనిచేస్తుంది, దీనివల్ల మీరు ఒకేసారి ఎన్ని యాప్స్ వాడినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. తక్కువ బ్యాటరీని వాడుకుంటూనే భారీ గేమింగ్ మరియు AI ఫీచర్లను చాలా స్మూత్ గా రన్ అయ్యేలా చేస్తుంది.

• Storage: 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ఇది డేటా ట్రాన్స్‌ఫర్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది, దీనివల్ల 4K సినిమాలు లేదా భారీ ఫైల్స్ కూడా సెకన్లలో కాపీ అవుతాయి. యాప్స్ ఓపెన్ అవ్వడం మరియు ఫైల్స్ లోడ్ అవ్వడం చాలా వేగంగా జరిగి, మీకు టైమ్ ఆదా అవుతుంది.

మీరు మల్టీటాస్కింగ్ ఎక్కువగా చేసే వారైతే, ఈ LPDDR5x మరియు UFS 4.1 కాంబినేషన్ మీకు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.

ఈ ఫోన్ మనసుకు హాయినిచ్చే Seaside Lilac (స్టైలిష్ లుక్) మరియు క్లాసిక్ గా ఉండే Stellar Black అనే రెండు అద్భుతమైన రంగుల్లో లభిస్తుంది.

వివో ఫోన్ అంటేనే కెమెరా. ZEISS సంస్థతో కలిసి రూపొందించిన 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ కు ప్రధాన ఆకర్షణ.

• 50MP Main Camera: ఇది సోనీ IMX921 1/1.56″ sensor సెన్సార్‌తో వస్తుంది. OIS vivo Camera-Bionic Spectrum Technology 2.0 సపోర్ట్ వల్ల ఫోటోలు మరియు వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లియర్ గా వస్తాయి.

• 50MP Super Telephoto: ఇందులో IMX882 సెన్సార్ ఉపయోగించారు. ఇది 3x నుండి 10x ఆప్టికల్ జూమ్ చేయగలదు, దూరం ఉన్న వస్తువులను కూడా అద్భుతమైన డిటైలింగ్‌తో క్యాప్చర్ చేస్తుంది.

• 50MP Ultra-Wide: ఇందులోని JN1 సెన్సార్ 15mm ఫోకల్ లెంగ్త్‌తో గ్రూప్ ఫోటోలకు మరియు ల్యాండ్‌స్కేప్ ఫోటోలకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది.

• 32MP Front Camera: క్వాలిటీ సెల్ఫీల కోసం KD1 1/3.44″ sensor అమర్చడం జరిగింది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో Multi-Focal HD Portrait ఫీచర్ ఉంది. ఇది 23mm నుండి 100mm వరకు వేర్వేరు ఫోకల్ లెంగ్త్స్‌లో ఫోటోలు తీయడానికి అనుమతిస్తుంది. అంటే మీరు మూడీ స్ట్రీట్ ఫోటోగ్రఫీ నుండి ప్రొఫెషనల్ హెడ్‌షాట్స్ వరకు నాచురల్ బొకే ఎఫెక్ట్‌తో తీసుకోవచ్చు.

Redmi Note 15 5G లాంచ్: అదిరిపోయే ఫీచర్లు, భారీ డిస్కౌంట్లు.. ధర ఎంతంటే?

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో బ్యాటరీ తక్కువగా ఉంటుంది, కానీ వివో ఇందులో భారీ 6200mAh బ్యాటరీని 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 40W wireless ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మామూలు బ్యాటరీ కాదు , 3rd Gen Silicon Anode Tech మరియు Semi-Solid-State Battery టెక్నాలజీతో వస్తోంది. దీనివల్ల ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్నా ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది.

Bypass Charging for Gaming: ఈ ఫీచర్ గేమర్స్‌కు ఒక వరం లాంటిది; ఇది ఛార్జింగ్ పెట్టి ఆడుతున్నప్పుడు కూడా ఫోన్ వేడెక్కకుండా (No Heat) కాపాడుతుంది. దీనివల్ల ప్రాసెసర్ వేగం తగ్గకుండా ఉండి, మీరు BGMI లేదా Genshin Impact లాంటి హెవీ గేమ్స్‌ను ఎటువంటి లాగ్ లేకుండా చాలా స్మూత్ గా ఆడుకోవచ్చు.

ఈ అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న vivo X200T కోసం మీరు కూడా నాలాగే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారా? జనవరి 27న లాంచ్ కాబోయే ఈ మొబైల్‌ను దక్కించుకోవడానికి సిద్ధంగా ఉండండి. తెలుగుప్రెస్ ను ఫాలో అవ్వండి.